నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీస్ లో “ఆదిత్య 369” కి ప్రత్యేక స్థానం వుంది.. అప్పటి వరకు ఏ హీరో చేయని ప్రయోగం బాలయ్య చేసారు.. దేశంలోనే మొట్ట మొదటి టైం ట్రావెల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది..తనకి భైరవ ద్వీపం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో బాలయ్య ఈ సినిమా చేసారు..ఎస్ పి బి బాలసుబ్రమణ్యం నిర్మాణంలో తెరకెక్కిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. బాలయ్య ఈ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో అద్భుతంగా నటించాడు. అప్పట్లో భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 4వ తేదీన మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు.
చరణ్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!
ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ కు చేయని విధంగా ఫస్ట్ టైమ్ ఆదిత్య 369కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈవెంట్ లో మూవీ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం తన అదృష్టం అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని అన్నారు..
నేను పాత్రల పరంగా వేరియేషన్స్ కోసం చూస్తున్న టైమ్ లో కృష్ణ ప్రసాద్ గారు, సింగీతం శ్రీనివాసరావు నా దగ్గరకు వచ్చి కథ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. పౌరాణిక పాత్రల్లో నాన్న గారి లాగా నటించాలని అనుకున్నాను. ఇందులో శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర కోసం ఒప్పుకున్నాను. ఆ పాత్ర నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాలా పాత్రల్లో కనిపించాను. దర్శకుడు అన్నీ అనుకున్నట్టు బాగా కుదిరాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావుకు, శివలెంక కృష్ణ ప్రసాద్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు… అలాగే ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా నా ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లుగా బాలయ్య తెలిపారు.. అది కూడా బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది..