MOVIE NEWS

ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!!

సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ పరువు పూర్తిగా పోయింది.. అసలు ఎందుకు వెళ్ళావ్ అన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పుడంతా పుష్ప 2 సక్సెస్ కంటే వివాదం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు..ఒక రాష్ట్ర గవర్నమెంటే అల్లుఅర్జున్ కి వ్యతిరేకంగా ఉంది..ఈ ఘటనలో తన తప్పు లేదంటూ ఎంత గట్టిగా వాదించిన పోలీసులు విడుదల చేసిన వీడియోలో మాత్రం తప్పు స్పష్టంగా అల్లుఅర్జున్ దే అని తెలుస్తుంది..సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా శనివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.దానికి కౌంటర్ గా అల్లుఅర్జున్ ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

తాను ఏ తప్పు చేయలేదని.. సీఎం అలా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ అంశంపై సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి తోచిన విదంగా వారు స్పందిస్తున్నారు. తాజాగా, తెలంగాణ డీజీపీ జితేందర్ సైతం ఈ అంశంపై స్పందించారు. అల్లు అర్జున్ సినిమా హీరో అయి ఉండొచ్చని, కానీ తానూ ఓ పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన అన్నారు. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదని.. కానీ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తాజాగా అల్లుఅర్జున్ ఇష్యూ పై ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి తీవ్రంగా స్పందించారు..

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏసీపీ…మా పోలీసులు తలచుకుంటే అల్లు అర్జున్ రీల్స్ కట్ అయిపోతాయి.. చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ లంచం ఇస్తున్నాడని మాకు తెలిసింది..అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా.. అని తీవ్రంగా మండిపడ్డారు..పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు..అస్సలు నీకు ఎందుకు చెప్పాలి..నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా.? నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా.. తెలంగాణలో ఉందా? ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి.? తెలంగాణ ప్రజలు సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ.? ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారు. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము బ్రతిమిలాడామా?.’ అంటూ గట్టిగానే నిలదీశారు.

Related posts

చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

murali

కోరటాల శివ: ప్రభాస్‌తో కొత్త చిత్రం డీక్లేర్

filmybowl

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment