ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి తిరుగులేని విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా వైడ్ బాగా పాపులర్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..బన్నీ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు తెలుస్తుంది… ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి మూడు సూపర్ హిట్స్ వచ్చాయి..
పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!!
ఇక బన్నీ మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..”AA22” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.శివపార్వతుల పుత్రుడు లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి)ప్రయాణం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా సోషియో మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో ఉండబోతుందనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది… ఈ మూవీ తండ్రీకొడుకుల (శివుడు- కార్తికేయ) పున: కలయికను చూపించబోతుందని సమాచారం.
ఇదే కనుక నిజం అయితే ఈ సినిమాకి ఊహించని క్రేజ్ రావడం మాత్రం పక్కా అని తెలుస్తుంది..”గాడ్ ఆఫ్ వార్” టైటిల్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.త్వరలోనే ఓ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.