MOVIE NEWS

AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు..

ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

తాజాగా ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్ 8 అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, బిగిల్‌, తేరి వంటి సంచలన హిట్స్ అందుకున్నాడు….. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న అట్లీ..

అల్లుఅర్జున్ తో భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది..ఇదిలా ఉంటే ఈ సినిమా కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన టాలీవుడ్ సీతగా గుర్తింపు తెచ్చుకున్న మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం..త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు..

Related posts

ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

murali

అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!!

murali

ఎస్ఎస్ఎంబి : రెండు పార్టులుగా మహేష్ సినిమా..రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment