ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇంతటి భారీ హిట్ అందుకున్న తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ఐకాన్ స్టార్ అధికారికంగా ప్రకటించారు.అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది. అయితే, ఈ సినిమాలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని మొదట న్యూస్ వైరల్ అయింది..
అఖిల్ ‘లెనిన్’ మూవీ బిగ్ అప్డేట్..శ్రీలీల ప్లేస్ లో ఆ క్రేజీ హీరోయిన్..!!
దీనితో ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతుంది . అట్లీ ఈ సినిమాను ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాడట..ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలలో కనిపించబోతున్నాడని సమాచారం..అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో విభిన్న పాత్రలలో నటించబోతున్నాడట…
ఈ సినిమాలో అల్లుఅర్జున్ తాతగా, తండ్రిగా, ఇద్దరు కుమారులుగా ఏకంగా నాలుగు పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. ఏకంగా ఈ సినిమాతో ఆయన నాలుగు పాత్రలు చేయనుండటంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారంతో అత్యంత గ్రాండ్‌గా నిర్మించడానికి రంగం చేస్తుంది..సినిమా క్యాస్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం..
