ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు.ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అసలైన ఫ్యానిజం అంటే ఇదే.. సందీప్ వంగా పోస్ట్ వైరల్..!!
ఈ మూవీ గురించి ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు గానీ ఈ మూవీ లైన్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ వైరల్ అవుతుంది..ఈ సినిమాను ఉగాది స్పెషల్‌గా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం.ఈ మూవీ కోసం త్రివిక్రమ్ మరోసారి అనిరుధ్ రవిచందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాతో అనిరుధ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన త్రివిక్రమ్ ఆ సినిమా ఫలితం నిరాశపరచడంతో ‘అరవింద సమేత’ కు మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ సినిమాకు అనిరుధ్ సెట్టవ్వలేదు. దీంతో తమన్‌ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు అనిరుధ్ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొడుతున్న నేపథ్యంలో మళ్ళీ అనిరుధ్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం..
ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని సమాచారం., కథకు తగ్గట్టుగా భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ‘పుష్ప 2’ సినిమాతో బన్నీకి భారీగా మార్కెట్ పెరిగింది.. దీనితో ఈ బడ్జెట్ రాబట్టడం కష్టమేమి కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు..