MOVIE NEWS

AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!!

ఐకాన్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం అందుకున్నాడు..తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించునున్నాడు… ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, ఈ సినిమా కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు.సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సహకారంతో అల్లు అర్జున్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించాడు. లాయిడ్ స్టీవెన్స్, గతంలో జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు, రణవీర్ సింగ్ వంటి స్టార్స్‌తో పనిచేశాడు.

రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!!

‘AA22xA6’లో అల్లు అర్జున్ కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనే కాకుండా, విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు, ఇందులో అతను తన జుట్టును షార్ట్‌గా కట్ చేసి, బీర్డ్‌ను ట్రిమ్ చేసిన స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.అయితే, ఇది ఫైనల్ లుక్ కాదని, సినిమా కోసం మరిన్ని వైవిధ్యమైన లుక్స్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం., అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘AA22xA6’ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

ఇందులో పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో పాటు అత్యాధునిక VFX ఉంటాయని సమాచారం.దాదాపు 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ కొత్త లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్ వున్నారు..

Related posts

మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే..?

murali

ఒకే స్టేజ్ పైకి పాన్ ఇండియా హీరోలు….

filmybowl

Leave a Comment