ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు.ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.బన్నీ కోసం త్రివిక్రమ్ సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నాడు.. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు..
war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..?
కానీ వీరి కాంబో విషయంలో ఊహించని ట్విస్ట్ వచ్చింది.. బన్ని, త్రివిక్రమ్ కాంబో ఓకే అయినా కానీ మూవీ ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ విషయంపై అల్లుఅర్జున్ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం..తన కోసం కథ రెడీ చేసి ఎదురుచూస్తున్న త్రివిక్రమ్‌ని తాజాగా అల్లు అర్జున్ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తివ్రిక్రమ్‌కి వివరించినట్లు సమాచారం…
ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్ చేయమని బన్నీ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేశారట. దీనికి త్రివిక్రమ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది.. ఇంతకీ అల్లుఅర్జున్ తరువాత సిమాను ఎవరితో చేస్తున్నాడంటే.. ఇటీవల జవాన్ తో భారీ హిట్ అందుకున్న అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు..