MOVIE NEWS

వరుస ప్లాప్స్.. గాడి తప్పిన నితిన్ కెరీర్.. కారణం అదేనా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దిల్ సినిమాతో నితిన్ హీరో గా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..దాంతో నితిన్ సైతం స్టార్ హీరోల సరసన చేరతాడు అని అంతా ఊహించారు. కానీ సంబరం అనే సినిమాతో నితిన్ తొలి ప్లాప్ చూసాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో  సై అనే సినిమా చేసాడు.. సై సినిమాతో నితిన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

హరిహర వీరమల్లు : ట్రైలర్ తోనే అదరగొట్టిన పవర్ స్టార్..!!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ అందుకున్నాడు. హిట్ కోసం పోరాడుతూ 2012లో ఇష్క్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘అఆ’ సూపర్ హిట్ అయింది..ఆ తరువాత నితిన్ చేసిన సినిమాలలో ‘భీష్మ’ఒక్కటే సూపర్ హిట్ అయింది.. మిగిలిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి..ముఖ్యంగా మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. రాబిన్ హుడ్ సైతం నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇక నేడు నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా రిలీజ్ అయింది..

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా కు కూడా మిశ్రమ స్పందన వస్తుంది.. ఇన్ని ప్లాప్స్ చూసాక నితిన్ పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలుస్తుంది..నితిన్ స్టోరీ సెలక్షన్ ప్రేక్షకులను మెప్పించట్లేదు.. కొత్తదనం వున్న సినిమా చేస్తేనే నితిన్ గట్టెక్కే అవకాశం ఉంటుంది..అయితే యాక్టింగ్, డాన్స్, కామెడీ టైమింగ్ ఉండి కూడా నితిన్ ఎందుకో వెనుక పడుతున్నాడు.. ఈ ప్లాప్స్ ఇలానే కొనసాగితే మాత్రం నితిన్ కనుమరుగవడం ఖాయంగా చెప్పొచ్చు..

Related posts

పుష్ప 2 ఎఫెక్ట్… ఆర్య 2 రీ రిలీజ్ కు భారీ బందోబస్త్..!!

murali

‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!!

murali

సరికొత్త లుక్ లో ఎన్టీఆర్.. పిక్ అదిరిందిగా..!!

murali

Leave a Comment