MOVIE NEWS

ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రీసెంట్ గా తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకు దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

అయితే దేవర సినిమా సెకండ్ పార్ట్ కోసం పార్ట్ వన్ లో అదిరిపోయే లీడ్ ఇచ్చారు.. త్వరలోనే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తెరకెక్కించనున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.. దీనితో కొరటాల తన తరువాత సినిమాను ఎవరితో చేయాలి అనే డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుసగా రెండు మూడు సినిమాలతో బిజీ కావడం వల్ల ఆయనకు డేట్స్ ఇచ్చే హీరో దొరకడం లేదు. దీనితో మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.

స్టార్ హీరో విజయ్ దేవరకొండతో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయడానికి కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే విజయ్ దేవరకొండ వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక దాంతోపాటుగా కొరటాల శివ డైరెక్షన్ లో కూడా  సినిమాకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది…త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం

Related posts

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

murali

మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా?

filmybowl

వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!!

murali

Leave a Comment