ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి తిరుగులేని విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా వైడ్ బాగా పాపులర్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..బన్నీ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు న్యూస్ వైరల్ అయింది…. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి వంటి మూడు సూపర్ హిట్స్ వచ్చాయి..ఇక బన్నీ మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా అని న్యూస్ వైరల్ అవడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి..
వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!!
అయితే సడన్ గా సీన్ లోకి అట్లీ రావడంతో త్రివిక్రమ్ సినిమా హోల్డ్ లో పడింది.. అట్లీ తో అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.. త్వరలో ఈ సినిమా షూటింగ్ మెదలు కానుంది.. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్,త్రివిక్రమ్ కాంబో లో వచ్చే సినిమాపై నిర్మాత నాగావంశీ కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలుగు సినీ పరిశ్రమ పౌరాణిక సినిమాలు ఎందుకు తీయడం మానేసిందో నాకు అర్ధం కావట్లేదు..అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పౌరాణిక చిత్రం రాబోతుంది..దీని స్థాయిని చూసి దేశం ఆశ్చర్య పోతుంది..పురాణాల్లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కథతో ఈ సినిమా తెర కెక్కుతుంది అని నాగ వంశీ తెలిపారు..ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది