MOVIE NEWS

మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శంకర్ కమిట్మెంట్స్ వల్ల ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. దీనితో గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. ఇదిలా ఉంటే ఏ సినిమాకి అయినా కూడా  డైరెక్షన్ టీమ్ అంటూ కొందరు వుంటారు… సినిమాలోని కొన్ని షాట్స్ ను దర్శకుడు కాకుండా డైరెక్షన్ టీమ్ లోని సీనియర్ తో తీయించడం జరుగుతుంది…

ఒక్కోసారి దర్శకుడు అందుబాటులో లేని సమయంలో లేదా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నప్పుడో ఈ డైరెక్షన్ టీమ్ లో సీనియర్స్ సినిమాను హ్యాండిల్ చేస్తూ వుంటారు..అయితే “గేమ్ ఛేంజర్” సినిమా విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది.శంకర్ భారతీయుడు 2 షూటింగ్ లో బిజీగా వున్న సమయంలో “గేమ్ ఛేంజర్” సెకండ్ యూనిట్ వర్క్ మొత్తం సినిమాకు ఎలాంటి సంబంధం లేని శైలేష్ కొలను హ్యాండిల్ చేశాడు, ఆ విషయాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడు.

జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం శైలేష్ కొలను “హిట్ 3” వర్క్ లో బిజీగా ఉండడంతో, సినిమాలోని కొన్ని సీన్స్ ను హ్యాండిల్ చేయడానికి ప్లాప్ డైరెక్టర్ సుధీర్ వర్మ రంగంలోకి దిగాడని సమాచారం.. శంకర్ ప్రస్తుతం చెన్నైలో “గేమ్ ఛేంజర్” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండడంతో సుధీర్ వర్మ మ్యానేజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది..ప్రస్తుతం హైదరాబాద్ సారథి స్టూడియోలో జరుగుతున్న “గేమ్ ఛేంజర్” షూటింగ్ వర్క్ ను సుధీర్ వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు..అయితే విజయవాడలో జరుగుతున్న మెయిన్ & చివరి షెడ్యూల్ ను శంకర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది..ఈ రెండు షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.ఇంత మంది దర్శకులు చేతిలో పడ్డ గేమ్ ఛేంజర్ హిట్టు కొడుతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

అకిరా నందన్ తో ఖుషి 2..ఎస్.జె సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!!

murali

లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

filmybowl

Leave a Comment