స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ తో వరుస భారీ సూపర్ హిట్స్ అందించిన ఘనత శంకర్ కే దక్కుతుంది.. సినిమాకు రిచ్ నెస్ పరిచయం చేసింది కూడా దర్శకుడు శంకరే..
అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?
సినిమాను ఎంత గ్రాండ్ గా, అద్భుతమైన విజువల్స్ తెరకెక్కిస్తే ఆ సినిమాకు అంత వాల్యూ ఉంటుందని దర్శకుడు శంకర్ అప్పట్లోనే గ్రహించారు.. అద్భుతమైన గ్రాఫిక్స్, గ్రాండియర్ విజువల్స్ శంకర్ సినిమా రీతినే మార్చేసారు..ఆయన తెరకెక్కించిన సినిమాలలో హీరో పాత్ర చాలా బలంగా ఉంటుంది.. సినిమా చూసే ప్రేక్షకులని ఆద్యంతం కథతో కనెక్ట్ చేయగల సత్తా వున్న ఏకైక దర్శకుడు శంకర్.. అయితే ప్రస్తుతం శంకర్ సినిమాలలో రిచ్ నెస్ వున్నా ప్రేక్షకులకు పాత శంకర్ మ్యాజిక్ మిస్ అవుతుంది.. రీసెంట్ గా శంకర్’భారతీయుడు-2′ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ మూవీ ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతో మందికి తెలుసు. నాకు ప్రస్తుతానికి బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన అయితే లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే కనుక కచ్చితంగా రజనీ కాంత్ బయోపిక్‌నే తీస్తాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి