MOVIE NEWS

ఇకపై థియేటర్స్ లో వారికి నో ఎంట్రీ ..తమిళ చిత్ర నిర్మాతమండలి కీలక నిర్ణయం..!!

ఒకప్పుడు ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ప్రేక్షకులంతా థియేటర్స్ కి వందల కిలోమీటర్లు బండ్లు కట్టుకొచ్చి మరీ చూసే వారు.ఆ రోజులల్లో ప్రేక్షకులే అసలైన రివ్యూయర్స్..వారికి సినిమా నచ్చలేదా నిర్మోహమాటంగా చెప్పేస్తారు.దీనితో దర్శక నిర్మాతలు సైతం కొత్త కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే వారు.కథలు దొరకని సమయంలో పక్క ఇండస్ట్రీ లో సూపర్ హిట్ అయిన సినిమాను ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా రీమేక్ చేసి రిలీజ్ చేసేవారు.అలంటి సినిమాలు తమిళ్ ఇండస్ట్రీ లో చాలానే వున్నాయి.తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఇక్కడ రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.

అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా స్థాయి బాగా పెరిగిపోయింది.కరోనా మహమ్మారి పుణ్యమా అని థియేటర్స్ మూతబడి ఓటిటిలు అందుబాటులోకి వచ్చాయి.ఓటిటిలు మానవ జీవితంలో అలవాటుగా మారిపోయాయి.ఆ మహమ్మారి వదిలిన ఈ ఓటిటిలు మాత్రం వదలడం లేదు.దీనితో ప్రేక్షకులు థియేటర్స్ కి ఫ్యామిలీతో వచ్చి చూడటం మానేశారు.ఒకప్పుడు సినిమాలు 100,200 రోజులు ఆడేవి.కానీ ఇప్పటి సినిమాలు వచ్చిన వారానికే బిచాణా సర్దేస్తున్నాయి.ఇప్పుడంతా మొదటి వారమే సినిమాకు కీలకం.. ఆవారంలో సినిమాకు భారీ కలెక్షన్స్ రాలేదా ఆ సినిమా ప్లాప్ అని అంతా నిర్ధారిస్తారు.

మహేష్ కు రాజమౌళి సరికొత్త కండిషన్స్.. బాబు పాటిస్తాడా..?

కలెక్షన్స్ మాత్రమే ఇప్పుడు కీలకం.అయితే ఇప్పటి మేకర్స్ కీ మరో తలనొప్పి రివ్యూస్..ఒక సినిమా బాగుందా లేదా అనేది సినిమా వచ్చిన గంటలో కొంతమంది రివ్యూయర్స్ నెట్టింట పోస్ట్ చేస్తారు.ఈ కంప్యూటర్ యుగంలో చిన్న వార్త అయిన సరే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది..దీనితో ఆ రివ్యూస్ చూసిన ప్రేక్షకులు సినిమాకు రావడమే మానేస్తున్నారు.దీనితో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.దీనితో తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై థియేటర్స్ లోకి రివ్యూ రాసేవారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది .రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండటంతో తమిళ చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంగువా సినిమా రివ్యూల మూలంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.దీనితో నిర్మాతల మండలి నిర్ణయం కరెక్ట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్‌ తిరిగి సెట్స్‌లో

filmybowl

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!!

murali

Leave a Comment