ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ” పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీనితో పుష్ప 2 పై కూడా భారీగా అంచనాలు పెరిగాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ట్రైలర్ ఆద్యంతము ఎంతగానో ఆకట్టుకుంది.ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ ట్రైలర్ లో వున్నాయి.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..
ఆ విషయంలో దేవరతో పోలిస్తే పుష్ప వంద రెట్లు బెటర్ ..బన్నీ స్ట్రాటజీ అదిరిందిగా ..!!
ట్రైలర్ లాంచ్ కు భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి మేకర్స్ పుష్ప ప్రమోషన్స్ మొదలు పెట్టారు.రానున్న రోజులలో మేకర్స్ మరిన్ని భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేయనున్నారు.ఇదిలా ఉంటే పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ ఆహా లో పాపులర్ అయిన బాలయ్య అన్ స్టాప్పల్ టాక్ షో కు హాజరయ్యాడు.ఈ సారి బన్నీ తన ఇద్దరి పిల్లలతో కలిసి పాల్గొన్నాడు.ఈ షో లో బాలయ్య అల్లు అర్జున్ పిల్లలతో సరదా ప్రశ్నలు అడిగి ఫన్ క్రియేట్ చేసారు.
ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఈ ఎపిసోడ్ ఈ నెల 22 న స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ షో లో బాలయ్య అల్లు అర్హను “నీకు తెలుగు వచ్చా ?” అని అడిగారు.బాలయ్య అలా అడిగిన వెంటనే అర్హ “అటజని కాంచె భూమిసుర అంబర చుంబి ” పద్యం గుక్క తిప్పుకోకుండా చెప్పింది.దీనితో బాలయ్య వెంటనే లేచి అల్లు అర్హకు ముద్దు పెడతారు.అర్హను చూస్తూంటే తెలుగు భాష నాలుగు కాలాలపాటు బ్రతుకుతుందనే నమ్మకం కలిగిందని బాలయ్య చెప్పుకొచ్చారు.