Trivikram talks about that hero
MOVIE NEWS

ఆ హీరో పై త్రివిక్రమ్ కామెంట్స్.

Trivikram talks about that hero
Trivikram talks about that hero

Trivikram talks : హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి దర్శకుడు త్రివిక్రమ్‌ తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ “విజయ్‌ దేవరకొండ నాకు చాలా బాగా ఇష్టమైన నటుల్లో ఒకరు. సినిమాల్లోకి వచ్చాక అభిమానుల నుంచి ఎంత ప్రేమను చూసాడో.. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు.

ఇంత చిన్న వయసులో , ఇంత తక్కువ కెరీర్ స్పాన్ లో ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. విజయ్ చాలా గట్టోడు.

బాలగంగాధర్‌ తిలక్‌ రాసిన అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత లో ‘మా వాడే మహా గట్టివాడే’ అని రాశారు. దానికి స్ఫూర్తిగా తీసుకొని చెప్తున్నా
మా విజయ్‌ మహా గట్టోడు, ఏం భయంలేదు. నెస్ట్ సినిమా మీ అంచనాలను అందుకుంటాడు. గట్టి హిట్ కొడతాడు.

ఇక దుల్కర్‌ గురించి చెప్పాలంటే నేను ఆయన్ని పెద్దగా కలవలేదు ఎందుకంటే నాకు షూటింగ్‌ కి వెళ్ళడం కంటే, ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూడటానికి ఇష్టపడతాను. సినిమాల్లో దుల్కర్‌ నటన చూసి అతనితో ప్రేమలో పడిపోయాను. ఇంకా ఇంతకంటే చెప్తే బాగోదు.

ఇండియన్‌ సినిమాకి మలయాళం సినిమా ఒక కొత్త యాంగిల్‌ క్రియేట్‌ చేసింది. అలాంటి ఒక న్యూ వేవ్‌ మలయాళం సినిమాలో ఒక మైల్‌ స్టోన్‌ దుల్కర్‌ సల్మాన్‌. మమ్ముట్టి లాంటి మహా వృక్షం కింద ఎదగడం అంత సులువు కాదు కానీ దుల్కర్ ఆ పని నీ చాల సమర్ధవంతంగా పూర్తి చేశాడు.

ఇక ఈ సినిమా నిర్మాత, దర్శకులు నాగవంశీ, వెంకీకి మంచి విజయాన్ని అందించాలి’’ అని కోరుకుంటున్న అన్నాడు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘ ‘నా సోదరుడు దుల్కర్‌ నటించిన లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా రిలేషన్ ఈ రోజుది కాదు మహానటి నుంచి నేను, దుల్కర్ చాల కలిసిపోయాం , చాల మాట్లాడుకునే వాళ్ళం.

పెళ్లిచూపులు సినిమా మంచి విజయం సాధించిన తరువాత నాకు ఫస్ట్‌ చెక్‌ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్‌ నుంచే. త్రివిక్రమ్‌ గారు నన్ను ఆఫీస్‌కి పిలిపించి, కూర్చోబెట్టి మాట్లాడారు, ఫస్ట్‌ చెక్‌ ఇప్పించారు. ఇప్పటికి ఏడేళ్ళు అవుతుంది. చాలారోజులు పట్టింది సినిమా చేయడానికి కానీ ఆ రోజు వంశీ అన్న నన్ను సినిమా చేయమని ఇబ్బంది పెట్టలేదు.

అందుకే అనిపిస్తుంది విజయ్‌ దేవరకొండ12 సితార లో చెయ్యాలని రాసిపెట్టుందేమో. నేను, గౌతమ్‌ త్వరలోనే ఒక మంచి సినిమా తో మీ ముందుకు వస్తాం, మంచి సినిమా తీసుకొస్తాం. ఆరోజు త్రివిక్రమ్‌ గారిని కలవడం నా లైఫ్‌లో ఒక బిగ్‌ మూమెంట్‌.

Also Read :  అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

మన జనరేషన్‌ కి బెస్ట్ ఎంటర్టైనర్ ఫిల్మ్స్ అందించిన దర్శకుడు త్రివిక్రమ్ గారు. మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్‌, జల్సా, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన నన్ను ఆఫీస్‌ లో కూర్చోబెట్టి నువ్వు స్టార్‌ అవుతావు రా చెక్‌ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.

ఆయన నా అభిమాన దర్శకుల్లో ఒకరు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి ఆయన చెప్తుంటే వింటూ కూర్చోవచ్చు’’ అని విజయ్ అన్నారు.

ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్‌ ట్రైలర్స్‌ లో ఒకటి. లక్కీ భాస్కర్‌ తో వెంకీ ఒక కొత్త లెవెల్‌ అన్‌ లాక్‌ చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలని , అయిద్దని కోరుకుంటున్నాను. వెంకీ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. మీనాక్షి చౌదరికి కూడా ఇందులో మంచి దొరికిందని అర్థమవుతోంది’’ అని చెప్పారు.

Follow us on Instagram

Related posts

నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..?

murali

అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!!

murali

కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!!

murali

Leave a Comment