Pottel Movie Full Review
MOVIE REVIEWS

పొట్టేల్ సినిమా రివ్యూ

Pottel Movie Full Review
Pottel Movie Full Review

Pottel Movie Full Review : 

నటీనటులు: యువ చంద్ర, అనన్య నాగళ్ల, అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్
దర్శకుడు: సాహిత్ మోత్కూరి
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి – సురేష్ కుమార్ సాదిగ
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరా: మోనిష్ భూపతిరాజు
Release Date : అక్టోబర్ 25, 2024

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువ హిట్స్ చిన్న సినిమాలకే చూస్తుంది. గత మూడు, నాలుగు నెలలు గా చిన్న సినిమాలన్నీ దాదాపుగా లాభాలని తెచ్చి పెడుతున్నాయి అదే ఇంకో చిన్న సినిమా రిలీజ్ కి రెడీ అయింది.

చిన్న సినిమాలు వచ్చి హిట్ కొట్టడం చాలనే చూశాం కానీ ఈ మధ్య కాలం లో ఓ చిన్న సినిమాకి విపరీతమైన బజ్ రావడం బహుశా “పొట్టేల్” సినిమా కి మాత్రమే దక్కిన అదృష్టమే అని చెప్పాలి.

సినిమా కి ఎంచుకున్న ప్రమోషనల్ కంటెంట్ కానీ, ప్రెస్ మీట్ లో అడిగిన ఒక కాంట్రెవర్సియల్ హడావుడి వల్ల కానీ సినిమా అందరికీ ఈజీ గా రీచ్ అయ్యింది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల అవుతుండగా.. సినిమా మీద ఎంతో నమ్మకం తొ రెండ్రోజుల ముందే మీడియా కోసం ప్రీమియర్స్ వేశారు దర్శకనిర్మాతలు. మరి “పొట్టేల్” చిత్రం ఆ నమ్మకాన్ని ఎంత మేరకు నిలబెట్టుకుందో తెలుసుకుందామా…. ఐతే రివ్యూ చదవండి

కథ: ఇది రాష్ట్ర విభజన ముందు కథ. ఇప్పటి తెలంగాణ రాష్ట్రం లో, నాస్తి ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయక ముందు తెలంగాణ ప్రాంతంలోని గుర్రంగట్టు అనే ఓ కుగ్రామం లో జరిగిన కథ ఈ “పొట్టేల్”.

బాలమ్మ పొట్టేల్ కు కాపరుడైన గంగాధర్ (యువ చంద్ర) ఊరికి పెద్ద అయిన పటేల్ (అజయ్) ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకొని వీరిని రక్షించుకోవాలని చూస్తుంటాడు. అయితే.. ఊరంతా పటేల్ వ్యవస్థను గుడ్డిగా నమ్మి గంగ ఎంతగా మొత్తుకుంటున్నా ఆ మాటలని ఎవరు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతుంటారు.

పటేల్ వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో తెలియచేస్తూ దాని నుండి బయటకు రమ్మని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపునిచ్చిన తర్వాత కూడా పటేల్ గుర్రంగట్టు ప్రజలందరి పై మూఢ నమ్మకం ముసుగులో అందరినీ భయపెడుతూ అధికారం చలాయిస్తూనే ఉంటాడు.

తాను చదువుకోలేకపోయాడు కాబట్టే తన మాట, తాను నిజం చెప్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదని.. కనీసం తన బిడ్డ సరస్వతినైనా చదివించాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు గంగ.

ఆ సంకల్పం తో ముందుకెళ్తున్న గంగ కి ఆ ఊరి లో, ఆ ఊరి పెద్ద వల్ల ఎదురైన సమస్యలు ఏమిటి? గంగ ఆశలను పటేల్ ఎలా తొక్కిపెట్టాడు? గుర్రంగట్టు ప్రజలు పటేల్ ఆడుతున్న ఆటను ఎప్పటికీ అర్థం చేసుకున్నారు. ఆ దుర్మార్గుడి నుండి ఎలా బయటపడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానo ఇస్తూ సాగిపోతుంది“పొట్టేల్” చిత్రం.

నటీనటుల పనితీరు: అజయ్ కి చాల పోటేంషియల్ ఉంది. నటుడిగా ఎన్నో మంచి పాత్రలు వేశాడు. కానీ ఇది అజయ్ మాత్రమే చేయాల్సిన పాత్ర అనేతువంటిది ఇప్పటి వరకు పడలేదు. ఆ లోటు నీ పొట్టెల్ తీర్చేసింది అనే చెప్పాలి. ఒక మంచి నటుడికి ఆసక్తికరమైన పాత్ర ఇస్తే ఏస్థాయిలో జీవిస్తాడు అనేందుకు పటేల్ పాత్రలో అజయ్ ఒదిగిపోయిన విధానం ఉదాహరణగా చెప్పచ్చు.

ఈ మాట అంటే ఆస్థ అతి గా వుండచ్చు గాని “లెజెండ్”లో జగపతిబాబు, “విక్రమ్”లో విజయ్ సేతుపతిల తర్వాత ఆ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దారు విలన్ క్యారెక్టర్నీ “పొట్టేల్” సినిమాలో.

పాత్ర పుట్టుక నుంచి ఆ పాత్ర ఎందుకు అలా వ్యవహరిస్తుంది, దానికి కారణం ఏమిటి? వంటి విషయాలు దర్శకుడు చాల నేర్పుతో, ఓర్పుతో రాసుకున్నాడు, ఆ రాత లో ఎంత కష్టపడ్డాడో , తీత లో కూడా దర్శకుడు తన ప్రతిభ నీ చించాడు.

అలాగే దర్శకుడి కష్టాన్ని అర్థం చేసుకొని అజయ్ పటేల్ పాత్ర నీ తెరపై పండించిన తీరు అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం అనే చెప్పుకోవాలి. అజయ్ లాంటి నటుడ్ని మన దర్శకులు సరిగా వినియోగించుకోకుండా పరభాషా నటులను అనవసరంగా పోషిస్తున్నారు అని సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి అనిపించక మానదు.

ఇప్పటికే “మత్తు వదలరా 2, దేవర” సినిమాతో మంచి ఊపు లో ఉన్న అజయ్ కి “పొట్టేల్” ఎన్నాళ్ల నుండో రాకుండా ఉండిపోయిన గుర్తింపును తీసుకొస్తుందిప్.

ఇక హీరో పాత్రలో చేసిన యువ చంద్ర నటన చాల శ్రద్ధ గా చేశాడు. పాత్ర కోసం తనను తాను మార్చుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా కూతురు చదువు కోసం దేనికైనా తెగించే తండ్రిగా అతడి నటన చాలా సహజంగా ఉంది. అందరికీ చెరువవుతుంది అనడంలో సందేహం లేదు.

అనన్య మరోసారి చాల సహజమైన పాత్రలో మంచి నటనతో ఆకట్టుకుంది. ఆమె కట్టు బొట్టు, ఆ ముఖంలోని అమాయకత్వం బుజ్జమ్మ పాత్రకు ప్లస్ అయ్యాయి. అనన్య చెప్పినట్టు బహుశా తెలుగు ప్రేక్షకుడికి ఈమె బుజ్జమ్మ గానే గుర్తుండిపోతుంది అన్నట్టు ఈ పాత్ర తాను చేసింది.

టీచర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్, ఊరి మనిషి పాత్రలో నోయల్ చక్కని నటనతో ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యం గా చెప్పుకోవాల్సింది సరస్వతిగా నటించిన పాప తన్వి శ్రీ, పెద్ద పెద్ద కళ్లతో భయాన్ని, బాధని ఇంత చిన్న వయసులోనే తాను పండించిన తీరు అభినందనీయం.

సాంకేతికవర్గం పనితీరు: శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. సినిమా మూడ్ నీ రిఫలెక్ట్ చేస్తూ సన్నివేశానికి ఎంత మేరకు కావాలో సరిగ్గా తూకం వేసి మరి ఇచ్చాడు. ఇక సినిమా లోని పాటలన్నీ ఎక్కేస్తాయి. నేపథ్య సంగీతమైతే.. సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. సినిమా నీ ఒక ఎత్తులో నిలబెట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రీ-రికార్డింగ్ & వోకల్స్ తారా స్థాయిలో ఉన్నాయి. శేఖర్ చంద్ర కెరీర్ కి ఈ సినిమా ఓ పెద్ద మైలురాయిగా నిలుస్తుంది.

Also Read : మెగా సీజన్ స్టార్ట్స్

కెమెరామెన్ మోనిష్ భూపతిరాజు వర్క్ కూడా ఈ సినిమాకి కీలకమే. ప్రీక్లైమాక్స్ లో ఒక సన్నివేశం లో తన సత్తా చాటాడు. అలాగే.. సినిమా లోని ప్రతి సన్నివేశంలో ఎమోషన్ కు తగ్గట్లుగా వినియోగించిన లైటింగ్ & ఫ్రేమింగ్ ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి.

ఈ సినిమా కి టెక్నికల్ టీం వర్క్ ప్రాణం పోసింది.. ఈ కథ 1950 నుండి1990 దశకం లో జరిగేదే అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి వేరే ఆలోచన రాకుండా తీశారు. ఏ మాత్రం ప్రేక్షకుడికి వేరే ఆలోచన రానీయకుండా వాళ్లు తీసుకున్న జాగ్రత్తలు సూపర్ అనే చెప్పాలి.అదే విధంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ నీ మెచ్చుకోవాల్సిందే

నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా భారీగానే ఖర్చు చేశారు దానికి తగా ఫలితం కూడా అందుకోనున్నారు. దర్శకుడి విజన్ కు ఎంతలా సపోర్ట్ ఇచ్చారో ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఓ దర్శకుడికి రెండో చిత్రానికి ఇలాంటి నిర్మాతలు దొరకడం అంటే దర్శకుడు ఒక రకంగా అదృష్టం చేసుకున్నాడని చెప్పుకోవాలి.

దర్శకుడు సాహిత్ మోత్కూరి తొలి సినిమా “సవారి” (2020). ఆ సినిమా అంతగా అలరించకపోయినా ఆ అపజయం తాలూకు కసి “పొట్టేల్” సినిమా రైటింగ్ లో కనిపిస్తుంది. సినిమా బ్యాక్ డ్రాప్, పాత్రల తీరుతెన్నులు, క్యారెక్టర్ ఆర్క్స్ రాసుకున్న విధానం అబ్బురపరిచింది.

Read Also :  ఇట్స్ మీనాక్షి టైం

ముఖ్యంగా ఓ స్వార్థపరుడు దైవాన్ని, మూఢ నమ్మకాల్ని తనకు కావాల్సినట్లుగా వాడుకొని అమాయకులైన ప్రజలను ఎలా గొర్రెల మందలా మార్చి తన చుట్టూ తిప్పుకున్నాడు అనే అంశాన్ని రాసుకున్న విధానం ఆశ్చర్యపరుస్తుంది. మొత్తం మీద సాహిత్ కి దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు వేస్తారు ప్రేక్షకులు అని చెప్పాలి.

విశ్లేషణ: చదువు అనేది ఎంత ముఖ్యమో అది ఒక మనిషిని కాదు మొత్తం సమాజాన్ని, వ్యవస్థను తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని “పొట్టేల్” సినిమా ద్వారా మరో సారి తెలియజెప్పడం అనేది అభినందనీయం.

చివరగా పొట్టేల్: అందరికీ నచ్చే మాంచి సినిమా.

Filmy Bowl Movie Rating: 3/5

Follow us on Instagram 

Related posts

సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

‘వేట్టయాన్’ మూవీ రివ్యూ

filmybowl

Leave a Comment