Thandel : నాగచైతన్య – చందు మొండేటి కల ఇక వస్తున్న సినిమా తండేల్. చానాళ్ల తర్వాత చైతు సినిమా మీద రిలీజ్ కి ముందు మంచి బజ్ వచ్చింది. ధన్నీ కాపాడుకుంటూ చిత్ర బృందం కూడా సినిమా గురించి మంచి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.
కానీ చిక్కల్లా రిలీజ్ డేట్ విషయం ఒక్కటే. విడుదల తేదీ తాలూకు డోలాయమానం ఇంకా కొనసాగుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నుండి నితిన్ హీరో గా వస్తున్న రాబిన్ హుడ్ డిసెంబర్ 20 ప్రకటించారు కాబట్టి చైతు సినిమా కూడా ఇదే డేట్ కి రావొచ్చనే ఊహాగానాలు పరిశ్రమలో బలంగా వినపించాయి. కానీ దానికి తగ్గట్టు ఎలాంటి ప్రకటన రాలేదు చిత్ర యూనిట్ నుంచీ.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అప్పటిలోపు పోస్ట్ ప్రొడక్షన్ అవ్వదని ఫస్ట్ కాపీ సిద్ధం చెయ్యలేమని దర్శకుడు చందూ చెప్పడం వల్లే అనౌన్స్ మెంట్ ఆగిపోయిందని అంటున్నరు.
ఇప్పుడు తాజాగా తండేల్ 2025 సంక్రాంతికి వస్తోందనే వార్త బయటకి రావటం తో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు పూర్తి గా యాక్టివేట్ అయిపోయి సోషల్ మీడియా లో హడావిడి చేయడం మొదలుపెట్టారు.
ధానికి కారణం కూడా వుంది ఇటీవలే బన్నీ వాస్ ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచినా ఇంటర్వ్యూలో తండేల్ ని ఎక్కువ కాలం హోల్డ్ చెయ్యలేమని ఈ ఏడాది చివరిలో లేదా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. ఆ మాట ప్రకారం క్రిస్మస్ లేదా సంక్రాంతి రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి కచ్చితం గా వస్తది అని ఫిక్స్ అయిపోయారు .
అయితే సంక్రాంతి బరి లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య 109, వెంకటేష్ – అనిల్ రావిపూడి చిత్రం, సందీప్ కిషన్ మజాకాలు అధికారికంగా రేసులో వున్నాయి.
తండేల్ లాంటి కంటెంట్ ఉన్న మూవీకి, పైగా చైతుకి ఇప్పుడు కత్తితో హిట్ కావాలి. అలాంటప్పుడు పోటీలో రావటం కంటే తర్వాత వస్తే బెటర్ అనే మాట వినిపిస్తుంది. థియేటర్ల పరంగా ఇబ్బందులు రావొచ్చు. గీతా ఆర్ట్స్ కు ఎంత నెట్ వర్క్ ఉన్నా కాంపిటీషన్ లో ఉన్న నిర్మాతలు తక్కువైనోళ్లు కాదు.
Read Also : పుష్ప 2 గురించి దేవి మాటల్లో..
సరే ఇవన్నీ కాదు రావాల్సిందే అని పట్టుబడితే
వీలైనంత త్వరగా విడుదల తేది తేల్చి చెప్పడం బెటర్. ఎందుకంటే దానికి అనుగుణంగా ప్రమోషన్లు మొదలు పెట్టాలి కదా. వరస డిజాస్టర్లతో డీలా పడ్డ చైతు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.
శ్రరీరక శ్రమ తీసుకోవడంతో పాటు హెయిర్ స్టైల్ కూడ నెలల తరబడి మెయిటైన్ చేస్తున్నాడు. లవ్ స్టోరీ థూ తనకి మంచి హిట్ ఇచ్చిన సాయిపల్లవితో రెండోసారి జత కట్టడం, ఇక సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లాంటి ఆకర్షణలు ఇందులో బోలెడున్నాయి. ఎక్కువ సస్పెన్స్ లేకుండా కుండ బద్దలు కొట్టమని చైతు ఫ్యాన్స్ డిమాండ్.
Follow us on Instagram