Raa Macha Macha Game Changer : శంకర్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్. ఆ చిత్రం నుంచి రెండో సింగల్ గా రా మచ్చా రా అనే పాట ని సినిమా యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది.
దర్శకుడి శంకర్ సాంగ్స్ పిక్చరైజేషన్ భలే ఉంటుంది. ఎంతో మంది జనాలు.. డాన్సర్లు.. ఆర్టిస్టులు
ప్రతీ ఫ్రేమ్ గ్రాండియర్ గా…
పాటలను ఈ రేంజ్ తీయడం ఇండియన్ సినిమాల్లో శంకర్ కి తప్ప ఎవ్వరికీ సాధ్య పడదు
అని ఎందుకంటారో ఈ పాట తీసిన విధానం తో మరోసారి రుజువైంది.
Read Also : కొత్త విద్య నేర్చుకోడం లో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ
ప్రోమో లో చూయించినట్టుగానే సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి . రాంచరణ్ స్క్రీన్ ప్రెసెన్స్ , బీట్ కి తగ్గ డాన్సులు చక్కగా కుదిరాయి. ఇంకా ఫాన్స్ ని రంజింప చేయడానికి చిరంజీవి మోస్ట్ పాపులర్ వీణ స్టెప్ , చిరంజీవి కటౌట్ ని కూడా వాడేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబందించిన ఒక రిఫరెన్స్ ని పెట్టేసి అభిమానులని ఆనందం లో ముంచెత్తారనే చెప్పాలి.
ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ ఈ పాట కి సాహిత్యం అందించారు
కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారి చిత్రం చిత్రీకరణ ముగింపు కి వచ్చింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి నిర్మాత రాజు ప్రయత్నాల్లో ఉన్నారు
Follow us on Instagram