MR.Idiot Trailer released
VIDEOS

మిస్టర్ ఇడియట్ ట్రైలర్ రిలీజ్

MR.Idiot Trailer released
MR.Idiot Trailer released

MR.Idiot Trailer : మాస్ మహారాజ రవి తేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరో గా పెళ్లిసందడి ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం లో రూపొందిన సినిమా “మిస్టర్ ఇడియట్” యలమంచిలి రాణి సమర్పణలో, జే జే అర్ అరవింద్ ఈ సినిమా ని నిర్మించారు.

సిమ్రాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ కానుంది. ఈ నేపధ్యం లో చిత్ర బృందం ఆదివారం సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు .

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ, సినిమా చూపిస్త మావా సినిమా నిర్మాత బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిధులుగా హాజరై చిత్ర బృందానికి తమ ఆశీస్సులు అందజేసారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ రవితేజ గారు ఎంతోమందికి అవకాశం ఇచ్చి వాళ్లందరు ఉన్నత స్థితి లో వుండడానికి తోడ్పడ్డారు. తన తొలిరోజుల్లో కూడా రవన్నా చాలా తోడ్పాటు అందిచారని గుర్తుచేసుకున్నారు.

అలాగే ఈ సినిమా టైటిల్ వినగానే తనకి ఇడియట్ సినిమా రోజులు గుర్తుకు వచ్చాయి అని ఆ సినిమా తో ఇండస్ట్రీ ట్రెండ్ మారిపోయిందని అలాగే ఈ చిత్రం కూడా చాలా గొప్ప విజయం సాధించాలని కోరుకున్నాడు.

వేణుగోపాల్ మాట్లాడుతూ ట్రైలర్ చూసాను మాధవ్ చాలా ఎనర్జిటిక్ గా , ఎంతో ఈజ్ తో నటించాడు. తనది కష్టపడే వ్యక్తిత్వం అని ఆ కష్టం తోనే మంచి సక్సెస్ఫుల్ హీరో గా ఎదగాలని కోరుకుంటున్న అని అన్నారు.

Read Also : దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి

సినిమా దర్శకురాలు గౌరీ మాట్లాడుతూ ప్రేక్షకులకి నచ్చే అంశాలతోనే ఈ సినిమా రూపొందించామని తప్పకుండ మిమ్మల్ని అల్లరిస్తుందని కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఈసినిమా ప్రేక్షకులకి అందిస్తుందని తెలియచేసారు.

చివరగా సినిమా హీరో మాధవ్ మాట్లాడుతూ ట్రైలర్ అందరికి నచ్చింది అనుకుంటున్న , మా దర్శకురాలు నాకు మంచి సినిమా అందించారు నవంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్న అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ సిమ్రాన్ శర్మ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.

Follow us on Instagram

Related posts

రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్…

filmybowl

అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

filmybowl

సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్ గా SDT18 మేకింగ్ వీడియో రిలీజ్..

filmybowl

Leave a Comment