MOVIE NEWS

ఆంధ్ర కింగ్ తాలూకా : ‘నువ్వుంటే చాలే’అంటున్న రామ్.. లిరికల్ వీడియో రిలీజ్..!!

టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’.. వరుసగా మాస్ సినిమాలు చేసి విసిగిపోయిన రామ్ ఈ సారి లవర్ బాయ్ అవతారమెత్తాడు.. తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట “నువ్వంటే చాలే” లిరికల్‌ వీడియో విడుదలైంది.ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్న “కూలీ”.. మరి వార్ 2 పరిస్థితి ఏంటి..?

ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ఈ పాటను రామ్ పోతినేని స్వయంగా రచించగా లిరికల్స్ మాత్రం ఎంతో క్యాచిగా వున్నాయి. ఒక్కో లైన్ వెనుక ఒక భావం ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ పాటలోని మ్యూజిక్ తో పాటు విజువల్స్ కూడా అద్భుతంగా వున్నాయి..రామ్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది..ఈ పాటను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ పాడగా వివేక్‌, మెర్విన్‌ సంగీతం అందించారు.

డబుల్ ఇస్మార్ట్ తో నిరాశపరిచిన రామ్ తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. రామ్ లుక్ సైతం కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి… ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. విడుదల తేదీపై మూవీ టీం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. రామ్ కెరీర్ లో మాస్ సినిమాల కంటే లవ్ స్టోరీస్ కి ఫ్యాన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు.. దీనితో రామ్ కూడా రూటు మార్చి క్యూట్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు..

Related posts

SM1 : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఫన్ మోజీ టీం..ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

AA22 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!

murali

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

murali

Leave a Comment