పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ ది రాజా సాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశ లో వుంది.. ప్రభాస్ నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చి చాలా కాలం అయింది.. రాజాసాబ్ మూవీ కామెడీ అండ్ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.. ప్రభాస్ మొదటిసారి ఇలాంటి జోనర్ మూవీలో నటిస్తున్నాడు.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ మూవీ నుండి రీసెంట్గా విడుదలైన టీజర్లో ప్రభాస్ డిఫరెంట్ లుక్స్‌తో పాటు కామెడీ, హీరోయిజం రెండు చూపించి సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు..
Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!!
ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్,రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుంగా తాజాగా ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతుంది…ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, “ది రాజా సాబ్” నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇది కేవలం ప్రభాస్ పైనే డిజైన్ చేసిన సోలో మాస్ సాంగ్ అని సమాచారం.
అదిరిపోయే మాస్ బీట్, విజువల్స్‌తో ఈ పాటను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన టీజర్‌కి మాస్ రెస్పాన్స్ రాగా, థమన్ అందించిన మ్యూజిక్‌కి కూడా ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి. దీనితో ఫస్ట్ సింగిల్ పై ఫ్యాన్స్ లో అంచనాలు అమాంతం పెరిగాయి..తమన్ ప్రభాస్ కోసం మాస్ ఆల్బమ్ సిద్ధం చేస్తున్నాడటా..గతంలో తమన్ ఇచ్చిన మాస్ ఆల్బమ్స్ కి మించి రాజా సాబ్ సాంగ్స్ ఉండనున్నట్లు సమాచారం..
