పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది పండగనే చెప్పాలి.. పవర్ స్టార్ నటిస్తున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.గత కొంతకాలంగా రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ మంచి సక్సెస్ సాధించారు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు.. ప్రస్తుతం పవన్ మూడు భారీ సినిమాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. రెండు సినిమాలు పూర్తి అయ్యాయి.. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ లో పవన్ బిజీగా వున్నారు.. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ పూర్తి కానుంది..
ఎన్నో ఏళ్లగా షూటింగ్ హోల్డ్ లో పడ్డ “హరిహర వీరమల్లు” సినిమాను పవన్ పూర్తి చేయడంతో ఆ సినిమా జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న సినిమా “ ఓజీ”..OG సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది..ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ఆగస్టు 15న విడుదల కానుందని సమాచారం..
ఇండియన్ 3 : రిలీజ్ పై అనుమానాలు.. ఈ ఏడాది లేనట్లేనా..?
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కళ్యాణ్ డైనమిక్ లుక్, హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌లో హైలైట్ కానున్నాయని తెలుస్తోంది.దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది… ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..
