MOVIE NEWS

ఇండియన్ 3 : రిలీజ్ పై అనుమానాలు.. ఈ ఏడాది లేనట్లేనా..?

విశ్వ నటుడు కమల్ హాసన్ తన కెరీర్ లో నటించిన బిగ్గెస్ట్ ఐకానిక్ మూవీ “ భారతీయుడు”.. ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర అభిమానుల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయింది..దేశ భక్తి, అవినీతి వ్యతిరేకంగా సాగిన ఈ కథ, శంకర్ విజనరీ డైరెక్షన్ ఎఆర్ రెహ్మాన్ అద్భుతమైన మ్యూజిక్ తో అల్ టైం హిట్ గా నిలిచింది…ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా వచ్చిన ఇండియన్ 2 సినిమా మాత్రం ఆశించిన విజయం అందుకోలేదు..

సూపర్ స్టార్ ‘ కూలీ ‘ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ సినిమాలో కూడా కమల్ ఓల్డ్ గెటప్ లో అద్భుతంగా నటించారు. మొదటి పార్ట్ ఉన్నంత రేంజ్ లో సెకండ్ పార్ట్ లేకపోవడంతో ఈ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే మేకర్స్ ఇండియన్ 3ని కూడా ప్లాన్ చేశారు. ఇండియన్ 2 మాత్రం అంచనాలను అందుకోలేకపోవడంతో మూడో పార్ట్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు తోడు కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. షూటింగ్ ఆగిపోయిందన్న రూమర్లు, ఓటిటి రిలీజ్ అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అలాగే ‘ఇండియన్ 3’ ప్రాజెక్ట్ మొత్తానికే స్వస్తి పలికేశారని న్యూస్ వైరల్ అయింది..

అయితే ఇప్పుడు మరోసారి తమిళ సినీ వర్గాల నుంచి ఆసక్తికర సమాచారం వైరల్ అవుతుంది… శంకర్ స్వయంగా ‘ఇండియన్ 3’ వస్తుంది అని స్పష్టంగా చెబుతుండగా, తాజా బజ్ ప్రకారం ఇప్పటికీ కొన్ని కీలక సన్నివేశాలు, ఒక పాట షూట్ మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. అవి పూర్తయ్యాక సినిమా త్వరలోనే థియేటర్లలోకి రావచ్చని సమాచారం.

Related posts

SSMB : ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్ వీడియో.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

murali

‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!!

murali

అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!!

murali

Leave a Comment