MOVIE NEWS

సెంథిల్ కుమార్: మహేష్, రాజమౌళి మూవీ చేయకపోవడానికి కారణం అదే..?

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదు.. పైగా ప్రతీ సినిమాకు దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది..ఇందుకు కారణం తన ప్రతి సినిమాలో పర్మినెంట్ గా టెక్నీసీయన్స్ ను ఆయన  కంటిన్యూ చేస్తుంటారు.వారిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. సెంథిల్ కుమార్,రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి రాజమౌళి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

బాహుబలి, ఆర్ఆర్ ఆర్ వంటి సినిమాలకు కూడా సెంథీల్ వర్క్ చేసారు. కానీ ఇప్పుడు రాజమౌళి-మహేశ్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీకి మాత్రం సెంథిల్ కుమార్ వర్క్ చేయట్లేదు. దీనిపై చాలా రకాల రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..వాటిపై తాజాగా సెంథిల్ క్లారిటీ ఇచ్చారు.

కింగ్డమ్ : రౌడీ స్టార్ మూవీ బిగ్ అప్డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..?

కిరీటి హీరోగా వస్తున్న జూనియర్ సినిమాకు సెంథిల్ కుమార్ పనిచేస్తున్నారు. ఈ మూవీ జులై 18న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సెంథీల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.. అందులో భాగంగా ఆయన ఈ రూమర్లపై స్పందించారు. రాజమౌళిది నాది ఎన్నో ఏళ్ల అనుబంధం. మా మధ్య బ్రేక్ అనేది కొత్త కాదు. గతంలో మర్యాద రామన్న, విక్రమార్కుడు సినిమాలకు కూడా నేను పనిచేయలేదు. అలా అని మా మధ్య రిలేషన్ ఏ మాత్రం దెబ్బతినలేదు. ఇప్పటికీ రెగ్యులర్ గా మేము మాట్లాడుకుంటాం. మహేశ్ తో చేసే మూవీకి నేను చేయాల్సింది. కానీ అనుకోకుండా కుదరలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. భవిష్యత్ లో మేం మళ్లీ కలిసి పనిచేస్తాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు..

Related posts

సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ??

filmybowl

RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!!

murali

ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

filmybowl

Leave a Comment