టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 750 సినిమాలలో నటించిన కోటా విలక్షణమైన పాత్రలతో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలయ్య, రాజశేఖర్, మోహన్ బాబు వంటి తదితరులు కోటా కు నివాళులు అర్పించారు..
నేను వచ్చేలోపే కోటన్న వెళ్ళిపోయాడు..వెక్కి వెక్కి ఏడ్చిన బాబూమోహన్..!!
ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావు మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.కోట శ్రీనివాసరావు నటనా ప్రతిభను కొనియాడుతూ, ఆయనతో తన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఎన్టీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కోట శ్రీనివాసరావు గారు తెలుగు చిత్రసీమకు అందించిన సేవలను, ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలను ఎన్టీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.సీనియర్ నటుల నుంచి నేటి జూనియర్ నటులతో కలిసి నటించిన ఘనత ఒక్క కోటా శ్రీనివాసరావుకే దక్కుతుంది.. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటించగల ప్రతిభ గల నటుడుగా కోటా గుర్తింపు పొందారు.
కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు.
నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ…— Jr NTR (@tarak9999) July 13, 2025
