అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. ఏజెంట్ ప్లాప్ తో డీలా పడ్డ అఖిల్ కాస్త గ్యాప్ తీసుకోని చేస్తున్న సినిమా “లెనిన్”.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను , అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మొదట టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీలా ఎంపికైంది.
ది ప్యారడైజ్ : నాని లేటెస్ట్ మూవీలో మోహన్ బాబు లుక్ లీక్..!!
రిలీజ్ చేసిన పోస్టర్స్ లో సైతం శ్రీలీల లుక్ అదిరిపోయింది. తర్వాత ఏమైందో ఏమో కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.శ్రీలీలను లెనిన్ చిత్రం నుంచి తప్పించిన తర్వాత మేకర్స్ షూటింగ్ పనులను మరింతగా వేగవంతం చేశారు. అయితే శ్రీలీలతో ఇప్పటికే తీసిన ఓ 2 వారాల సీన్లను ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ తో రీషూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. శ్రీ లీల తో తీసిన సీన్స్ అన్నింటిని మళ్లీ తిరిగి చిత్రీకరించబోతున్నారు. దీంతో టీమ్‌కు మరింత పని భారం పడనుందని సమాచారం. కాగా భాగ్యశ్రీ బోర్స్ జూలై 16 నుండి షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అవుతున్నట్టు సమాచారం.
ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. వరుస ప్లాప్స్ రావడంతో అఖిల్ కెరీర్ డేంజర్ లో పడింది.. ఈ సినిమా తో అయినా అఖిల్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..అక్కినేని ఫ్యామిలీ ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది.. నాగ చైతన్య తండేల్ సినిమాతో నాగార్జున కుబేర సినిమాతో మంచి హిట్స్ అందుకున్నారు.. అఖిల్ కీ కూడా హిట్ లభిస్తే అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతారు..
