గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది..ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా లో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, అలాగే మీర్జా పూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
స్పీడ్ పెంచిన నాగచైతన్య.. మరో భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్..?
ఇటీవల దేవర సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన ఆర్. రత్నవేలు పెద్ది సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..
అయితే తాజాగా చిత్రయూనిట్ నేడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీలో ఆయన పాత్రకు సంబంధించిన పవర్ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విడుదలైన శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ సినిమాలోని అతని పాత్ర ఎంత బలమైనదో చూపించింది.కోర మీసం, గంభీరమైన చూపుతో.. శివరాజ్ కుమార్ లుక్ అదిరిపోయింది. కాగా ఈ మూవీలో ఆయన ‘గౌర్నాయుడు’ పాత్రలో నటిస్తున్నారు..త్వరలో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు..
