మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’… యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.. మొన్నటి వరకు వరుస వాయిదాలతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి విశ్వంభర లేటెస్ట్ అప్డేట్ మరోసారి వారిలో ఉత్సాహాన్ని నింపింది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.
పవర్ స్టార్ “ఓజీ” బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కీ పండగే..!!
తాజాగా పూర్తి చేసిన 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్‌ను చిరంజీవి స్వయంగా వీక్షించగా, ఆయన ఈ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత చిరు, మిగిలిన భాగం ప్యాచ్ వర్క్ కోసం త్వరలోనే డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 18 న ఈ సినిమా విడుదల తేదీగా లాక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌లో మార్పు ఉండదని చిత్ర యూనిట్ ఖచ్చితంగా చెబుతుంది..దీనితో ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫలితం రాబోతుంది..
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ బిగ్గెస్ట్ మూవీకి ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, యువి క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. అలాగే ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా వంటి హీరోయిన్స్ కీలక పాత్ర పోసిస్తున్నారు.. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.. ఈ సాంగ్ లో నాగినీ బ్యూటీ మౌని రాయ్ చిందేయనుందని సమాచారం..త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి..
