పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస సినిమాలు రిలీజ్ కీ సిద్ధంగా వున్నాయి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు” మూవీ జులై 24 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అయింది.. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు.. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. దీనితో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్‌కమింగ్ బిగ్గెస్ట్ మూవీ ఓజీ ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు.
రామాయణ : ‘మండోదరి పాత్ర నుంచి కాజల్ ఔట్.. కారణం అదేనా..?
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా, ప్రియాంక మోహన్ జ్mహీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి. ఓజీ మీ అందరినీ ఆశ్చర్యపరచబోతోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఇందులో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను దసరా కానుకగా సెప్టెంబర్ 25న మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు గ్లింప్స్ వీడియో కీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ‘ఓజీ’పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
All shots fired and done..
Now it’s theatres’ turn…#OG’s ERA is set to stun…#TheyCallHimOG In Cinemas September 25th. #OGonSept25 pic.twitter.com/C6S3XBxs1H— DVV Entertainment (@DVVMovies) July 11, 2025
