MOVIE NEWS

AA22: ఐకాన్ స్టార్ మూవీలో హాలీవుడ్ స్టార్ విలన్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు..సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ మరో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు.. పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది.ఈ సినిమాను భారీ వీఎఫ్ఎక్స్ తో విజువల్ వండర్ గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న కొన్ని ఇమాజినేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

విశ్వంభర : యంగ్ లుక్ లో మెగాస్టార్..ఖుషిలో ఫ్యాన్స్..!!

ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమాలో భారీగా స్టార్లను తీసుకుంటున్నారు. తాజాగా ప్రేక్షకులలో ఈ మూవీ విలన్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా ఇండియన్ యాక్టర్స్ ను కాకుండా ఏకంగా హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారంట. ఇందుకోసం ప్రధానంగా ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.. వారిలో ఒకరు విల్ స్మిత్ కాగా మరొకరు డ్వెన్ జాన్సన్ వీరిద్దరూ హాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్.అయితే కానీ వీరిద్దరి బల్క్ డేట్స్ పట్టుకోవడమే చిత్ర యూనిట్ కి పెద్ద టాస్క్ అని చెప్పాలి. రెమ్యునరేషన్ భారీగా ఛార్జ్ చేస్తారు.ఈ విషయంలో అట్లీ అస్సలు తగ్గట్లేదని సమాచారం.

అట్లీ ఓ సినిమా మొదలు పెడితే చెప్పిన డేట్స్ లో సినిమాను ముగించేస్తాడు. అది నిర్మాతలకు ప్లస్ పాయింట్ కావడంతో ఈ సినిమాను కూడా వచ్చే 2027 కల్లా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం..2027 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.త్వరలో ఈ మూవీ క్యాస్ట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది..

Related posts

అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..?

murali

మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!!

murali

Leave a Comment