దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో బిగ్ మూవీ రాబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే బిగ్గెస్ట్ మూవీకి ‘ది పారడైజ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.. కాగా ఈనెల 21న ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం అయింది.. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా నాని ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో సతీష్ మాస్టర్ నేతృత్వంలో ఒక భారీ మాస్ అండ్ యాక్షన్ ఎపిసోడ్‌ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.
హరిహర వీరమల్లు : పవర్ స్టార్ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్..!!
ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ సాయంతో హై ఇంటెన్సిటీ యాక్షన్ తో డిజైన్ చేశారు. సినిమాకే హైలెట్‌గా నిలవబోయే ఈ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చుతుందని మేకర్స్ ధీమాగా వున్నారు..ఇక ‘ది పారడైజ్’ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుండటంతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా ఏకంగా 8 భాషలలో సినిమా విడుదల చేయనున్నారు..ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తోనే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
