టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కింగ్డమ్’… గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా జులై 31న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం అవుతుంది.ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ లో హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది..
తలైవా ‘కూలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!!
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తదుపరి సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ముహూర్తాన్ని అధికారికంగా ఖరారు చేశారు.విజయ్ దేవరకొండ 14వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూలై 10న ఉదయం 11:09 గంటలకు నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి ఎవరు హాజరుకాబోతున్నదే సస్పెన్స్‌గా ఉంచారు… గతంలో ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న రాహుల్ సాంకృత్యాయన్, ఈసారి చారిత్రాత్మక నేపథ్యం లో కథను తెరకెక్కించబోతున్నారు.
ఈ కథలో మన భారత చరిత్రలో జరిగిన ఓ కీలక సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా చేస్తుంది..
