MOVIE NEWS

‘వార్ 2’ షూటింగ్ పూర్తి.. హృతిక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్ లో వున్నాయి.. ఇదిలా ఉంటే తాజాగా సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 149 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, సినిమా కోసం పడిన కష్టాన్ని, చెమటను, గాయాలను ఆయన గుర్తుచేసుకున్నారు.వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయిన నాకు ఎదో తెలియని భావన కలిగింది.

పవర్ స్టార్ “హరిహర వీరమల్లు” అసలు స్టోరీ ఇదేనా..?

149 రోజుల విరామం లేని పోరాటం,.. తారక్ సర్, మీతో కలిసి పనిచేయడం, మీతో కలిసి ఇంత ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించడం చాలా గొప్ప గౌరవం. అద్వానీ కియారా, మీలోని ఆ డేంజరస్ సైడ్ చూసేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉంది. ఆది, అయాన్ల అద్భుతమైన సినిమాటిక్ విజన్‌ని మీరంతా చూసేందుకు నేను వేచి ఉండలేను అని వార్ 2 టీమ్‌కు, నటీనటులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు..

చివరగా.. కబీర్ పాత్రకు గుడ్ బై చెప్పడం కాస్త బాధగానే ఉంది…ఇదంతా మర్చి పోయి మళ్లీ నార్మల్ అవ్వడానికి నాకు కొన్ని రోజులు పడుతుందని హృతిక్ అన్నారు.. ఆగస్టు 14, 2025న వార్ 2 సినిమా గ్రాండ్ రిలీజ్ కానుందని హృతిక్ తెలిపారు..అయాన్ ముఖర్జి తెరకెక్కించిన ఈ బిగ్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మించారు..త్వరలోనే ఈ సినిమాకు సంబందించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేరీస్ వున్నారు..

Related posts

పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!!

murali

స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!!

murali

విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment