పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’…జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ మూవీ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో రిలీజ్ కానుంది. జులై 24న ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు..రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..
కుమారి 21 F : మరోసారి థియేటర్స్ లోకి బ్లాక్ బస్టర్ మూవీ.. రీరిలీజ్ ట్రైలర్ చూసారా..?
ఇదిలా ఉంటే వీరమల్లు కథ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది..హరి హర వీరమల్లు సినిమా తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడినట్లు సమాచారం.. అయితే వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు తెలిపాయి.. ఈ మూవీ నిజ జీవితంలోని ఏ నాయకుడి కథ ఆధారంగా తెరకెక్కలేదని వారు స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి కల్పిత కథగా ఈ సినిమా రూపొందినట్లు వారు తెలిపారు..
జ్యోతికృష్ణ దర్శకత్వం మొదలు పెట్టిన తరువాత నుంచి కథ పూర్తిగా మారిపోయింది…సరికొత్త కథగా దీనిని మలిచినట్లు సమాచారం..ఈ సినిమాలో హీరో ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల రూపంగా కనిపిస్తారని సమాచారం.. సినిమాలోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ ధీమాగా వున్నారు..
