పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్టులు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఆ పాట కోసం పలు టాప్ హీరోయిన్లను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, చివరకు తమన్నాని ఫైనల్ చేశారని సమాచారం… తమన్నా ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌కి హాట్ ఫేవరెట్ గా మారింది…
వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!!
బాలీవుడ్లో వరసగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ తమన్నా అదరగొడుతుంది.. తమన్నా హాట్ డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిపేలా చేస్తాయని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం రాజాసాబ్ లో తమన్నా ఎంట్రీ కన్ఫర్మ్ అయిందనే న్యూస్ వైరల్ అవుతుంది..
రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్,రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..రాజాసాబ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
