మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ మూవీ పాన్ ఇండియా వైడ్ 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. .
కింగ్డమ్ : రిలీజ్ డేట్ వచ్చేసింది.. లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా..!!
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేసాడు.
ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. వార్ 2 షూటింగ్ పూర్తయింది. దీన్నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సర్ తో సెట్ లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజ్ ని తయారుచేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14 న మీరు ఈ సినిమాని చూసేదాకా వేచిఉండలేను అని రాసుకొచ్చారు… దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది..ఎన్టీఆర్ వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో కూడా నటిస్తున్నాడు..
And It’s a wrap for #War2!
So much to take back from this one…It’s always a blast being on set with @iHrithik Sir. His energy is something I have always admired. There is so much I have learned from him on this journey of War 2.
Ayan has been amazing. He has truly set the…— Jr NTR (@tarak9999) July 7, 2025
