గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఈ సారి భారీ హిట్ అందుకోవాలని చరణ్ చూస్తున్నాడు.. ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ మూవీ కోసం బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు..
వరుస వాయిదాలకు స్వస్తి.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!!
చరణ్ కూడా ఈ సినిమా కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు..తాజా సమాచారం ప్రకారం పెద్ది షూటింగ్ ఢిల్లీ నగర శివార్లలోని ఓ రైల్వే స్టేషన్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సీన్స్ పూర్తయ్యాక నాసిక్ లో ఓ కీలక షెడ్యూల్ జరగనుంది. నాసిక్ షెడ్యూల్ లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారనట. సినిమాలోని ఎంతో కీలకమైన క్లైమాక్స్ తో పాటూ మూవీలో ఎంతో ప్రధానంగా నిలిచే క్రికెట్ మ్యాచ్ సీన్స్ ను కూడా త్వరలో షూట్ చేయనున్నారని సమాచారం.
అక్టోబర్ నాటికి పెద్ది సినిమా షూటింగ్ ను పూర్తి చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది… అక్టోబర్ లేదా నవంబర్ నాటికైనా ఎట్టి పరిస్థితుల్లో పెద్ది షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయాలని బుచ్చిబాబు ఆలోచిస్తున్నారు.. ఈ సినిమాలో చరణ్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.. చరణ్ బర్త్డే సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
