టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పదునైన మాటలతో పవర్ ఫుల్ కథలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.. అయితే గత ఏడాది “గుంటూరు కారం” సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను ఆయన లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు.., కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేనని చెప్పినట్లు తెలుస్తుంది..
పవన్ సినిమా నిధి పాప ఫేట్ మారుస్తుందా..?
ఇప్పుడు అదే కథను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ సినిమా నిర్మిస్తున్న వంశీ ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా గురించి హింట్స్ ఇచ్చారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటించబోతున్నాడు.అలాగే మిగతా పాత్రల కోసం త్రివిక్రమ్ కీలకమైన నటులను తీసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమాలలో కాస్టింగ్ చాలా బలంగా ఉంటుంది. చిన్న పాత్ర అయినా కూడా ప్రముఖ నటులను ఎంపిక చేసుకుంటారు…
దీనితో రాబోయే ఈ మైథలాజికల్ మూవీలో విలన్ పాత్ర కోసం దగ్గుబాటి రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. రానా కు పర్ఫెక్ట్ ఫిజిక్ అలాగే కమాండింగ్ వాయిస్ ఉండడంతో ఆ పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడని త్రివిక్రమ్ భావిస్తున్నారు. “బాహుబలి”తో రానా మంచి విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు..దీనితో ఈ సినిమాకు రానా విలన్ గా సరిగ్గా సరిపోతారని అంతా భావిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది..
