టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం, అభినయంతో ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. హాట్ పోజులతో నెట్టింట ఈ భామ రేపే దుమారం అంతా ఇంతా కాదు..అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఈ బ్యూటీ అలరిస్తుంది…అందమొక్కటే కాదు నటన పరంగా కూడా ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంటుంది..కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఈ భామ ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది.
వార్ 2 : తెలుగు రిలీజ్ అఫీషియల్.. స్పెషల్ వీడియో వైరల్..!!
మిస్టర్ మజ్ను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందంతో ఆకట్టుకుంది.. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత వచ్చిన సవ్య సాచి కూడా మెప్పించలేకపోయింది.అయితే ఈ భామ నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో ఈ భామకు హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చింది.. అలాగే డార్లింగ్ ప్రభాస్ సరసన రాజాసాబ్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ కూడా దక్కింది.. రెండు భారీ ఆఫర్స్ రావడంతో ఈ అమ్మడి జాతకం మారుతుందని అంతా అనుకున్నారు..
వీరమల్లు, రాజా సాబ్ సినిమాల షూటింగ్స్ ఎప్పుడో మొదలయ్యాయి.. ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు.. దీనితో ఈ భామను అంతా లైట్ తీసుకున్నారు.. ఈ అమ్మడు సైతం లక్ కోసం ఎదురుచూస్తుంది..ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి సిద్దమైంది.. జులై 24న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపైనే ఈ అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. పవన్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా కావడం.. అందులోను హీరోయిన్ గా ఈ భామ నటించడంతో ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే ఈ అమ్మడి ఫేట్ మారినట్లే..మరిన్ని స్టార్ అవకాశాలు ఈ భామకు లభిస్తాయి.. దీనితో నిధి భవిష్యత్ వీరమల్లు సక్సెస్ పై ఆధార పడి ఉంది..
