MOVIE NEWS

హరిహర వీరమల్లు : ట్రైలర్ తోనే అదరగొట్టిన పవర్ స్టార్..!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు..గత కొన్నేళ్లుగా హోల్డ్ లో వున్న ఈ భారీ ప్రాజెక్ట్ పవన్ ఎట్టకేలకు పూర్తి చేయడంతో ఈ సినిమా జులై 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కి వరుస వాయిదాలు అడ్డంకిగా మారాయి.. ఎట్టకేలకు రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు..రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేయగా..భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దుమ్ము లేపింది.

భారీ స్థాయిలో “వార్ 2” రిలీజ్..మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

కేవలం 24 గంటల్లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది… 24 గంటల్లోనే ఏకంగా 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 62 మిలియన్ల వ్యూస్ సాధించింది..ట్రైలర్ నుంచే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభిస్తుందని డైరెక్టర్ జ్యోతి కృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టు గానే ట్రైలర్ తోనే పవర్ స్టార్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసారు..

ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించాయి.. అలాగే విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.. పవన్ కల్యాణ్‌ నుంచి నాలుగేళ్ల తర్వాత భారీ సినిమా వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ వర్షం కురుస్తుంది..దీనితో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ ఓజీ “ మూవీ కూడా సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

Related posts

ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..?

murali

పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..?

murali

ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..?

murali

Leave a Comment