పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరిహర వీరమల్లు”.. ఈ సినిమా మొదలై ఐదేళ్లు పూర్తి కావొస్తుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షించారు.. పవన్ రాజకీయలలో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ కావడంతో సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం పట్టింది.. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. సరిగ్గా మూడు వారాల్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుండగా.. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..
SSMB 29 : భారీ రేటుకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న.. ప్రముఖ ఓటీటీ సంస్థ..?
దాదాపు మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా వుంది… విజువల్ ట్రీట్ ఇచ్చేలా ట్రైలర్ ఉండటంతో ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు… మేకర్స్ ముందు నుంచి ఈ సినిమాపై ఎంతో ధీమాగా వున్నారు.. కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు సైతం ఎంతో ఓపికగా సినిమాను పూర్తి చేసారు. ట్రైలర్ లో కేవలం మూడే మూడు డైలాగ్స్‌తో మేకర్స్ సినిమా కథను చెప్పేశారు.
మొఘలులను ఎదురించిన వీరుని కథే హరిహర వీరమల్లు కథ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.. పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ.. పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది..ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగ జేబు పాత్రలో ఎంతో పవర్ ఫుల్ గా నటించారు.. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆస్కార్ విన్నర్ ఎంఎం. కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం అదిరిపోయింది… మొత్తంగా పవన్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా ఈ ట్రైలర్ వుంది.జులై 24 న పవన్ విధ్వంసం సృష్టించడం ఖాయం గా కనిపిస్తుంది..
