MOVIE NEWS

SSMB 29 : భారీ రేటుకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న.. ప్రముఖ ఓటీటీ సంస్థ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ “SSMB29”.. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం కూడా పూర్తి అయింది..

హరిహర వీరమల్లు : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా విడుదల కాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్, మేకింగ్ వీడియో ఏవీ బయటకు రాకపోయినా ఆ మధ్య వచ్చిన కొన్ని లీక్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది… ఇంకా షూటింగ్ పూర్తి కానీ ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం..

రాజమౌళి సినిమా అంటే పాన్-వరల్డ్ క్రేజ్ సహజమే దీనికి తోడు మహేష్ బాబు హీరో కావడంతో ఈ క్రేజీ మూవీ కోసం ముందు నుంచే బడా ఓటీటీ సంస్థలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను భారీ ధరకు దక్కించుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది… అయితే ఈ డీల్‌పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు..త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తుంది.

Related posts

రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!!

murali

జింఖానా : మరో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తున్న ప్రేమలు హీరో..!!

murali

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Leave a Comment