MOVIE NEWS

విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’.. బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతుంది.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. వశిష్ట ఈ చిత్రాన్నీ ఎప్పుడు చూడనంత విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కు ఈ చిత్రం కచ్చితంగా గుర్తుండి పోతుందని ఆయన ఎంతో ధీమాగా వున్నారు..

ఫ్యాన్సీ రేటుకి ‘వార్ 2’ రైట్స్ పొందిన నాగవంశీ.. ఎన్ని కోట్లంటే..?

అయితే ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. అభిమానుల్లో మాత్రం ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విశ్వంభర గురించి సీక్రెట్ మెయింటైన్ చేసిన వశిష్ట ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో చిత్రం గురించి కీలక విషయాలు వెల్లడించారు.వశిష్ట మాట్లాడుతూ..సినిమా విడుదలలో ఆలస్యానికి ప్రధాన కారణం భారీ స్థాయిలో జరుగుతున్న VFX పని అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మొత్తం 4676 VFX షాట్లు ఉన్నట్లు తెలిపారు.

ప్రతీ ఫ్రేమ్ కూడా విజువల్‌గా అద్భుతంగా ఉండాలని మేం కష్టపడుతున్నాం. అందుకే టాప్‌ క్లాస్‌ గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా మీద పనిచేస్తున్నాయి కేవలం ఒక పాట మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది.ఈ పాటను కూడా త్వరలో చిత్రీకరించనున్నామనీ ఆయన తెలిపారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నాగినీ ఫేమ్ మౌని రాయ్ కనిపించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే విడుదల తేదీ ప్రకటిస్తాము’ అని వశిష్ట తెలిపారు..

Related posts

NTR -NEEL : భారీ లొకేషన్స్ లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా..!!

murali

హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!!

murali

ఇకపై థియేటర్స్ లో వారికి నో ఎంట్రీ ..తమిళ చిత్ర నిర్మాతమండలి కీలక నిర్ణయం..!!

murali

Leave a Comment