బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’.. ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైతం నటిస్తుండటంతో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..హృతిక్ రోషన్‌తో పోటా పోటీగా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందని సమాచారం.. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది… యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ సినిమాని అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
విజువల్ ట్రీట్ గా ‘విశ్వంభర’.. త్వరలో బిగ్ అప్డేట్..!!
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తికాగా.. నేడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సాంగ్ షూట్ కూడా ముంబైలో ప్రారంభమైంది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్ అయిన నాగవంశీ ఎన్టీఆర్ గత చిత్రం దేవర హక్కులను కూడా ఆయనే దక్కించుకున్నాడు.వార్ 2 సినిమా హక్కులను కూడా గట్టి పోటీలో దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా నిర్మాతలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు 100 కోట్ల వరకు డిమాండ్ చేయగా, సుమారు 80 కోట్ల వరకు నాగవంశీ పెట్టేందుకు సిద్ధమైనట్లు న్యూస్ వైరల్ అయింది… అయితే ఈ డీల్ ఎంతకు క్లోజ్ అయిందనే దాని మీద క్లారిటీ లేదు. కానీ ఫైనల్‌గా నాగవంశీ మాత్రం తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని భాషలలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..
