MOVIE NEWS

విజువల్ ట్రీట్ గా ‘విశ్వంభర’.. త్వరలో బిగ్ అప్డేట్..!!

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”..నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కారణంగా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో తమ సినిమా వాయిదా వేసినట్లు దసరా సమయంలో విశ్వంభర నిర్మాతలు ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయి దాదాపు ఏడు నెలలు కావొస్తుంది కానీ ఇప్పటికీ విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి.గతంలో రిలీజ్ చేసిన టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వంభర లో ఎవరూ ఊహించని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండనున్నాయట..

వార్ 2 : యుద్ధం లాంటి డాన్స్ మూమెంట్స్.. ఫ్యాన్స్ కి పండగే..!!

ఎన్నడూ లేని విధంగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది..యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ఆషికా రంగనాధ్, ఇషా చావ్లా వంటి హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు..

అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా రామ రామ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మంచి ప్రేక్షకాధరణ పొందింది.. త్వరలో ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ రానుంది..ఎంత ఆలస్యం అయిన ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించేలా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

Related posts

SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!!

murali

RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!!

murali

ఏజెంట్ : ఓటీటి రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఈ సారైనా మోక్షం కలిగేనా..?

murali

Leave a Comment