MOVIE NEWS

సూపర్ హిట్ ఇచ్చిన కొరటాలకు హీరోల కొరత..!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రైటర్ గా కెరీర్ ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో రైటర్ నుండి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు…మిర్చి తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకొని కొరటాల టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో చేరాడు..అలా కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలో కొరటాల శివ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఎంతగానో ఎదురు చూసారు.. కేవలం నాలుగు సినిమాలతోనే కొరటాల స్టార్ దర్శకుడు అయ్యారు… కానీ ఒకే ఒక ప్లాప్ కొరటాల కెరీర్ ను అమాంతం కింద పడేసింది.

రాంచరణ్ కి సూపర్ హిట్ మూవీ ఇవ్వబోతున్నాం.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

మెగా స్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఒక్క ప్లాప్  కొరటాల కెరీర్ పై బాగా ఎఫెక్ట్ చూపించింది.. స్టార్ హీరోలు ఎవరూ కూడా కొరటాల తో సినిమా చేసేందుకు సుముఖత చూపించ లేదు… కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు. దేవర సినిమాతో కొరటాల శివ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దేవర సుపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. కానీ ఇప్పుడు శివకు మరోసారి హీరోల కొరత ఏర్పడింది…

ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఎవరు లేరు. స్టార్ హీరోలు అంతా మరో రెండు సంవత్సరాలు ఖాళీ లేనంతగా బిజీ అయిపోయారు… నాని, విజయ్ దేవరకొండ లైనప్ కూడా ఫుల్ అయింది.దీనితో చిన్న హీరోలతో సినిమా చేయడానికి కొరటాల ఆసక్తిగా లేడు.ప్రస్తుతం కొరటాల చేతిలో వున్న బిగ్గెస్ట్ మూవీ దేవర 2. కానీ ఎప్పుడు మొదలు అవుతుందో తెలీదు..దీనితో కొరటాల సీనియర్ హీరోలతో సినిమా చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం..

Related posts

‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

murali

గేమ్ ఛేంజర్ : ట్రైలర్ రిలీజ్ వాయిదా.. మండిపడుతున్న ఫ్యాన్స్..?

murali

యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment