గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ గేమ్ ఛేంజర్”.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజవ్వగా ఆశించినంత ఫలితం సాధించలేదు.. స్టార్ డైరెక్టర్ శంకర్ వల్ల సినిమా వ్యయం పెరగడమే కాక మధ్యలో శంకర్ వేరే సినిమాకు వెళ్లిపోవడంతో సినిమా మరింత ఆలస్యం అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చరణ్ సినిమా విషయంలో శంకర్ అలా చేయడం అస్సలు తట్టుకోలేక పోయారు.దిల్ రాజు కూడా గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయినందుకు ఎంతగానో బాధపడ్డారు..తాను కూడా కొన్ని తప్పులు తెలిసి చేశాను అని పలు ఇంటర్వ్యూలలో గేమ్ ఛేంజర్ గురించి ఆయన మాట్లాడారు.
జ్యోతికృష్ణ : యానిమల్ చూసాక.. ఆయన పాత్ర పూర్తిగా మార్చేసా..!!
ఇదిలా ఉంటే దిల్ రాజు నిర్మాణంలో నితిన్ ‘తమ్ముడు’ మూవీలో నటిస్తున్నాడు.. నేడు తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడారు.దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మాకు చిన్న లోటు గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ తో సూపర్ హిట్ సినిమా తీయలేకపోయాం అని ఒక చిన్న గిల్ట్ ఉంది. త్వరలోనే చరణ్ తో హిట్ సినిమా తీయబోతున్నాం. త్వరలోనే దానిని అనౌన్స్ చేస్తాము అని ఆయన ప్రకటించారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రాబోయే దిల్ రాజు, చరణ్ సినిమాకు దర్శకుడు ఎవరై వుంటారా అని తెగ చర్చించుకుంటున్నారు..గతంలో రాంచరణ్, ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని న్యూస్ వైరల్ అయింది.. దీనితో ఆ భారీ కాంబోను దిల్ రాజు సెట్ చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది..
