టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కింగ్ డం”.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది.షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన సాంగ్ బాగా పాపులర్ అయింది..
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యలక్ష్మి బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాను జులై 4న రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించిన మేకర్స్ ఇప్పడు ఆ తేదిని వాయిదా వేశారు. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. కొత్త రిలీజ్ డేట్ మీద నెట్ ఫ్లిక్స్ తో డిస్కషన్ కూడా మొదలైంది. ఆగస్టులో సితార సంస్థ నిర్మించే రవితేజ సినిమా మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
దీనితో ఆగస్ట్ 1న రిలీజ్ చేయాలా లేదా జూలై 25న రిలీజ్ చేయాలా అనే విషయంలో నెట్ ఫ్లిక్స్ నుంచి క్లారిటీ రావాల్సి వుంది. జులైలో రిలీజ్ చేయాలనుకున్న ఆ నెలలో పవర్ స్టార్ హరిహర వీరమల్లు రిలీజ్ అడ్డంకిగా మారింది..హరిహర వీరమల్లు సినిమా జులై 24న రాబోతుంది.దీనితో ఆగస్టు ఫస్ట్ వీక్ లో వచ్చేందుకు కింగ్డమ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
