టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా వైడ్ నిన్న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో టాలీవుడ్ లో చాలా మంది మంచు విష్ణుకి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.తాజాగా కన్నప్ప మూవీపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో ఆర్జీవీ మెసేజ్ పెట్టారు.. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసారు…
ఫౌజీ : ప్రభాస్ లేటెస్ట్ పిక్ లీక్.. డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా..!!
నాకు అసలు దేవుళ్లు అంటే నమ్మకం లేదు. అందుకే నేను దేవుడు, భక్తులను అసలు ఇష్టపడను. కానీ తిన్నడు కన్నప్పగా మారే తీరును విష్ణు మూవీలో అద్భుతంగా చూపించాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.క్లైమాక్స్‌లో శివలింగం నుండి రక్తస్రావం ఆపడానికి తిన్నడు తన కళ్లను అందించే సీన్ లో విష్ణు పర్ఫార్మెన్స్ చూసి నాకు అద్భుతంగా అనిపించిందని ఆర్జీవీ తెలిపాడు.. ఒక నాస్తికుడిగా ఇది నాకు నచ్చదు. కానీ మీ నటనతో నన్ను ఈ సీన్ లో మునిగిపోయేలా చేశారు.
ఈ సినిమాలో అందరూ ప్రభాస్ ను చూడటానికి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం విష్ణును చూడటానికే వెళ్తున్నా అని ఆర్జీవీ రాసుకొచ్చాడు .దానికి విష్ణు కూడా రిప్లై ఇచ్చాడు. ఇలాంటి మెసేజ్ రావడం అంటే నిజంగా నా కల నిజమైనట్టే అని తెలిపాడు.. మీ ప్రేమకు నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా. ఈ మెసేజ్ నాకు ఎంతో విలువైనది అంటూ ఆర్జీవీ కి ఆయన రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే కన్నప్ప సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు..
